ఎన్‌ఎస్‌ఈలో అక్షయ తృతీయ స్పెషల్‌ ట్రేడింగ్‌

4 May, 2019 01:13 IST|Sakshi

మంగళవారంనాడు  ట్రేడింగ్‌ సమయం పెంపు

అక్షయ తృతీయ సందర్భంగా ఈనెల 7న (మంగళవారం) కాపిటల్‌ మార్కెట్‌ విభాగంలో ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించినట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ప్రకటించింది. ఈ విభాగంలోని గోల్డ్‌ ఈటీఎఫ్‌లు (ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌), ప్రభుత్వ గోల్డ్‌ బాండ్ల ప్రత్యక్ష ట్రేడింగ్‌ సమయాన్ని పెంచినట్లు వివరించింది.

మార్కెట్‌ సాధారణ ట్రేడింగ్‌ మార్కెట్‌ సమయం ఎప్పటిలానే ఉండనుండగా.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు మాత్రం క్లోజింగ్‌ సెషన్‌ రోజువారీలా ఉండదని తెలిపింది. వీటి ప్రీ–ఓపెన్‌ సమయం 4 గంటల 25 నిమిషాల నుంచి 4:30 వరకు కొనసాగనుండగా.. ఈ సమయంలో ఆర్డర్లు రద్దు చేసుకోవడానికి, క్యారీ ఫార్వార్డ్‌ చేయడానికి అవకాశం ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఈ స్పష్టంచేసింది. ప్రీ–ఓపెన్‌ తరువాత 4:30 నిమిషాలకు ట్రేడింగ్‌ మొదలై ఏడు గంటలకు ముగుస్తుంది.    

మరిన్ని వార్తలు