యూఎస్‌- రిటైల్‌ సేల్స్‌ జోష్‌

17 Jun, 2020 09:34 IST|Sakshi

2 శాతం ఎగసిన స్టాక్‌ ఇండెక్సులు

యూరోపియన్‌ మార్కెట్లు 3% ప్లస్‌ 

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు వీక్‌

నార్డ్‌స్ట్రామ్‌, కోల్స్‌ కార్ప్‌.. దూకుడు

గత నెల(మే)లో రిటైల్‌ అమ్మకాలు దుమ్ము రేపడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు జోష్‌వచ్చింది. డోజోన్స్‌ 527 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 26,290 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 58 పాయింట్లు(2 శాతం) ఎగసి 3125 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 170 పాయింట్లు(1.8 శాతం) పురోగమించి 9,896 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాలతో నిలిచాయి. మే నెలలో రిటైల్‌ సేల్స్‌ దాదాపు 18 శాతం జంప్‌చేయడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిపుణులు 8 శాతం వృద్ధిని అంచనా వేశారు. మరోవైపు ట్రంప్‌ ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్ల మౌలిక సదుపాయాల ప్యాకేజీకితోడు.. కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ అదనపు నిధుల ద్వారా కార్పొరేట్లకు అండగా నిలవనుండటంతో సెంటిమెంటు బలపడినట్లు తెలియజేశారు. 

జర్మన్‌ పుష్‌
ఆస్త్మా, ఆర్ధరైటిస్‌ తదితరాల చికిత్సకు వినియోగించే ఔషధం కోవిడ్‌-19 కట్టడికి కొంతమేర పనిచేస్తున్నట్ల యూకేలో వెల్లడికావడంతో మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లు సైతం లాభపడ్డాయి. అంతేకాకుండా జర్మన్‌ ఎకానమీ త్వరలో పుంజుకోనున్నట్లు ఒక సర్వే పేర్కొనడంతో ఫ్రాన్స్‌, యూకే, జర్మనీ 3-3.5 శాతం మధ్య ఎగశాయి. అయితే భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వద్ద వివాదం నేపథ్యంలో ఆసియా మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. సహాయక ప్యాకేజీని తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ 700 బిలియన్‌ డాలర్ల నుంచి 1 ట్రిలియన్‌ డాలర్లకు పెంచేందుకు నిర్ణయించింది..

ఎలీ లిల్లీ జోరు
రిటైల్‌ అమ్మకాలు ఊపందుకోవడంతో రిటైల్‌ దిగ్గజాలు నార్డ్‌స్ట్రామ్‌ ఇంక్‌ 13 శాతం, కోల్స్‌ కార్ప్‌ 9 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఈ బాటలో హోమ్‌ డిపో ఇంక్‌ సైతం 3.6 శాతం ఎగసింది. దీంతో డోజోన్స్‌కు బలమొచ్చింది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చికిత్సలో పురోభివృద్ధి సాధించినట్లు వెల్లడికావడంతో ఫార్మా దిగ్గజం ఎలీ లిల్టీ షేరు 16 శాతం దూసుకెళ్లింది. ఐటీ బ్లూచిప్‌ కంపెనీ ఒరాకిల్‌ కార్ప్‌ 2.5 శాతం పుంజుకుంది. వెల్స్‌ఫార్గో ఈ కౌంటర్‌ టార్గెట్‌ ధరను పెంచడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. స్ట్రీమింగ్‌ సంస్థ రోకు ఇంక్‌ 12.4 శాతం జంప్‌చేసింది. 

మరిన్ని వార్తలు