కోడెల కుమారుడిపై అట్రాసిటీ కేసు

9 Jul, 2019 08:26 IST|Sakshi

నరసరావుపేట టౌన్‌ : ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల కుమారుడి అవినీతి బాగోతం మరొకటి వెలుగు చూసింది. నరసరావుపేట పట్టణానికి చెందిన ఎమ్మార్పీఎస్‌ నేత కాల్వ రవి తన బంధువు ఎం.నాగరాజుకు ఉద్యోగం ఇప్పించే విషయంలో కోడెల తనయుడు శివరామ్‌ను కలిశారు. నాగరాజుకు జిల్లా పరిషత్‌లో అటెండర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని శివరామ్, అతని పీఏ నాగప్రసాద్‌  నమ్మబలికి రూ.7 లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని వారిద్దరినీ కాల్వ రవి నిలదీశాడు. దీంతో కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. బాధితుడు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివరామ్, అతని పీఏ గుత్తా నాగప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట టూటౌన్‌ సీఐ ఐ.కృష్ణయ్య సోమవారం తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు