రైలు ఢీకొని గ్యాంగ్‌మన్‌ మృతి

7 May, 2018 13:03 IST|Sakshi
పెద్దపల్లి రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని మృతిచెందిన నాగేష్‌

యలమంచిలి :  రైలు గేటు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని ఆదివారం రైల్వే గ్యాంగ్‌మన్‌ మృత్యవాత పడ్డాడు. యలమంచిలి రైల్వే స్టేషన్‌ సమీపంలోని పెద్దపల్లి రైల్వేగేటు వద్ద గేటు వేసి ఉన్న సమయంలో పట్టాలు దాటుతుండగా రామ్‌నగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగి ఎం.నాగేష్‌ (32)రైలు ఢీకొని మృతిచెందాడు. మృతుడు యలమంచిలి రైల్వేస్టేషన్‌ పరిధిలో గ్యాంగ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

కొద్దిరోజులుగా ఇతను సెలవులో ఉన్నట్టు మృతుడి బందువులు తెలిపారు. ఆదివారం రామ్‌నగర్‌లోని తన ఇంటి నుంచి మిలట్రీ కాలనీలోని బంధువుల ఇంటికి బయలుదేరిన నాగేష్‌ గేటు వేసి ఉన్న సమయంలో రైలుపట్టాలు దాటుండగా ప్రమాదానికి గురయ్యాడు. అప్‌లైన్‌లో వచ్చిన రైలును చూసి దానిని తప్పించుకునే సమయంలో డౌన్‌లైనులో వచ్చే మరో రైలు ఢీకొంది.

దీంతో నాగేష్‌ మృతదేహం నుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడికి రెండేళ్లక్రితం వివాహమైంది. ఒక బాబు ఉన్నాడని బంధువులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులు శోకసంద్రంలో మునిగారు. శవపంచనామా అనంతరం మృదేహాన్ని మృతుడి స్వగ్రామం అయిన రేగుపాలెం గ్రామానికి తరలించారు. తుని రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్‌సీ మూర్తి తెలిపారు.  

మరిన్ని వార్తలు