గ్యాస్‌ ట్యాంకరు బీభత్సం

20 Feb, 2018 13:13 IST|Sakshi
షాపులోకి దూసుకుపోయిన ట్యాంకర్‌

అదుపు తప్పి విద్యుత్‌ స్తంభం, పాన్‌షాపును ఢీకొన్న లారీ

అనంతరం భవనం సెల్లార్‌లోకి దూసుకుపోయిన వాహనం

తప్పిన పెను ప్రమాదం

పరవాడ(పెందుర్తి): గాజువాక–అనకాపల్లి జాతీయ రహదారిలో లంకెలపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ గ్యాస్‌ టాంకరు బీభత్సం సృష్టిం చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం పారాదీప్‌ నుంచి గ్యాస్‌ ట్యాంకర్‌ పరవాడ మండలం తాడి గ్రామం సమీప ఐవోసీ బాట్లింగ్‌ యూనిట్‌కు వస్తుంది. తెల్లవారుజామున 3 గంటలకు లంకెలపాలెం కూడలి సమీపంలోకి వచ్చేసరికి ట్యాంకరు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది.

అనంతరం పాన్‌షాపును బలంగా ఢీకొట్టి కాకతీయ హోటల్‌ భవనం సెల్లార్‌లోపలికి దూసుకుపోయింది. ఈ ఘటనలో విద్యుత్‌ స్తంభం విరిగిపోయింది. సపోర్ట్‌ స్తంభం ధ్వంసమైంది. పాన్‌షాపు కూడా ధ్వంసమై అందులో ఉన్న సామగ్రి పాడైపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి పరాయయ్యాడు. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు, పరవాడ సీఐ బీసీహెచ్‌.స్వామినాయుడు, ఎస్‌ఐ వెంకటరావులు సంఘటన స్థలానికి చేరుకొని హోటల్‌ సెల్లార్‌లోకి దూసుకుపోయిన గ్యాస్‌ టాంకరును క్రేన్‌ సాయంతో తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు