కులాంతర వివాహం: తల్లిదండ్రులకు చిత్రహింసలు

29 Jul, 2019 07:06 IST|Sakshi

ప్రియుడి తల్లిదండ్రులకు చిత్రహింసలు

చెన్నై, తిరువొత్తియూరు : కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన అమ్మాయి బంధువులు ప్రియుడి కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి చిత్ర హింసలకు గురిచేశారు. ఈ ఘటన ధర్మపురి జిల్లా పెన్నగరంలో చోటు చేసుకుంది. చిక్కంపట్టికి చెందిన కాళిదాసన్‌ (48) కుమారుడు అజిత్‌ కుమార్‌ (23)కోవైలోని ఓ కళాశాలలో చదువుతున్నాడు. తాలంపల్లానికి చెందిన రోజా కుమార్తె ప్రియ (22)ను ప్రేమిస్తున్నాడు. వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వారి ప్రేమకు తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ప్రేమికులిద్దరూ గత నెల ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రియ బంధువులు కోపోద్రిక్తులు కావడంతో భీతి చెందిన అజిత్‌ తల్లిదండ్రులు కాళిదాసన్, విద్య, చెల్లెలు చిన్నక్క, తమ్ముడు హరిహరన్, అతని కుమారుడు మంజునాథ్, బంధువులు సెల్వం, కృష్ణమూర్తి, హరిహరన్‌ ఊరు వదలి బెంగళూరులో ఉన్న బంధువు ఇంటికి వెళ్లి తల దాచుకున్నారు. ఈ సంగతి తెలుసుకున్న రోజా, కుటుంబ సభ్యులు వారికి నచ్చజెప్పి కారులో బెంగుళూరు నుంచి తాలంపల్లం గ్రామానికి తీసుకొచ్చారు. ఊరి మధ్యలో ఉన్న చింత చెట్టుకు కట్టి చిత్ర హింసలు పెట్టారు. మహిళలు అని చూడకుండా దాడి చేశారు. నాలుగు రోజులుగా ఓ ఇంటిలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. అనంతరం హోసురుకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. వారం లోగా ప్రియ, కుమార్‌ను తమకు అప్పగించాలని హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు సూపరింటెండెంట్‌ రాజన్‌ ఆదేశాల మేరకు పోలీసులు తాలంపల్లంలో మకాం వేసి విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పబ్‌పై పోలీసుల దాడి

రవిశేఖర్‌ను పట్టిస్తే రూ.లక్ష 

బేగంపేటలో వింగర్‌ బీభత్సం 

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

బేగంపేటలో టాటా వింగర్‌ బీభత్సం

వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం

అప్పు తీర్చమని అడిగితే తల తెగింది..

విజయవాడ కరకట్ట మీద కారు బీభత్సం

ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ.. ఇంటి నుంచి అదృశ్యమై..!

సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసుల పురోగతి

ఆస్పత్రిలో ఉరేసుకున్న వివాహిత

భార్య కాటికి.. భర్త పరారీ..

భార్యను పంపలేదని.. వదినను చంపిన మరిది

యువతితో ఎఫైర్‌ : ప్రియుడిని చావబాదారు

అదృశ్యమై.. చెరువులో శవాలై తేలారు

వైఎస్‌ జగన్‌ పీఏ నెంబర్‌ స్పూఫింగ్‌ చేసినందుకు అరెస్ట్‌

చారి.. జైలుకు పదకొండోసారి!

సానా సతీష్‌ అరెస్టు

నా కొడుకును చంపేయండి: చిట్టెమ్మ

భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోల మృతి

ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. రెండు బస్సులు దగ్ధం

సీఎంవో కార్యాలయ ఉద్యోగి అంటూ వసూళ్లు..

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..

ప్రజాసేవలో సైబర్‌ మిత్ర!

ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో దారుణం

గుంతను తప్పించబోయి..

షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌