ఇంత పైశాచికమా.. మౌనం వీడండి ప్లీజ్‌!

15 May, 2019 11:08 IST|Sakshi

కట్టుకున్న భార్యకు  శాడిస్ట్‌ భర్త టార్చర్‌

భార్య ప్రైవేట్ పార్ట్‌లో బైక్ హ్యాండిల్

రెండేళ్లు నరకం  చూసిన  బాధితురాలు

భర్తలు, తండ్రులు, ఇతర సన్నిహిత  కుటుంబ సభ్యుల  చేతుల్లోనే  మహిళలు, బాలికలు తీవ్రమైన దాడులకు, హింసకు గురవుతున్నారనీ  ఐక్య రాజ్య సమితి ఏనాడో తేల్చి చెప్పింది. దేశంలో మహిళలకు ఏపాటి రక్షణ ఉందో తెలియచెప్పడానికి, మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు అన్న కవి ఆవేదనకు నిలువెత్తు సాక్ష్యం  ఈ ఘటన.  నూరేళ్లు  కాపాడతానని ప్రమాణం చేసిన భార్య సైకోగా మారాడు. భార్య నిస్పహాయతను, మౌనాన్నిఆసరాగా చేసుకుని దారుణంగా హింసిస్తూ నిత్య నరకం చూపించాడు. అక్కడితో ఆ దుర్మార్గుడి అఘాయిత్యాలు అగలేదు. మరింత కౄరంగా వ్యవహించి తనలోని శాడిస్టు నైజాన్ని బయటపెట్టాడు. 

మధ్యప్రదేశ్‌లో భూపాల్‌లోచోటు చేసుకున్న ఈ కిరాతకుడి దుర్మార్గం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్ జిల్లాకు చెందిన  మహిళ(36) కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. భర్త బ్యాండ్ మేళంలో పనిచేస్తుంటాడు.  రెండేళ్ల క్రితం పిల్లల విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా తన పైశాచికాన్ని  కొనసాగించాడు. ఆమె ప్రైవేటు భాగాల్లో బైక్ హ్యాండిల్ దూర్చి నరకం చూపించాడు.  అనంతరం అక్కడినుంచి పత్తా లేకుండాపోయాడు. అయితే ఈ బాధ ఎవరితో చెప్పాలో అర్థం కాక, బాధితురాలు మౌనాన్ని ఆశ్రయించింది. ఒక పక్క అవమానం, మరోవైపు పిల్లల భవిష్యత్తు ఆమెను భయపెట్టింది. అయితే ఆమె గర్భసంచికి, పెద్ద పేగులు, మూత్ర నాళమునకు ఇన్‌ఫెక్షన్‌ సోకింది. కాలం గడుస్తున్న కొద్దీ నొప్పి తీవ్రం కావడంతో చివరికి  వైద్యులను, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించక తప్పలేదు.

బాధిత మహిళ గర్భసంచిలోకి  బైక్ హ్యాండిల్ భాగం చొచ్చుకుపోయిందని గుర్తించిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. అయితే దానికి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. దీంతో తన వైద్యానికి అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు రావాలో అర్థంకాక చివరికి పోలీసులకు మొరపెట్టుకుంది. బాధితురాలి కథనం పోలీసులను సైతం కదిలించింది.  వెంటనే స్పందించి బాధితురాల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో  డాక్టర్లు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. సుమారు ఆరు అంగుళాల పొడవున్న  ప్లాస్టిక్‌ భాగాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శాడిస్ట్ భర్తను కూడా అరెస్ట్ చేశారు.

అయితే ఇలాంటి అరాచకాలు, హింసపై ఇకనైనా మౌనం వీడాలని మహిళా సంఘాలు బాధిత మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. లేదంటే సహనాన్ని బలహీనతగా పరిగణించి శాడిస్ట్‌ భర్తలు మరింత రెచ్చిపోతారని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు