ఘోర రోడ్డుప్రమాదం : ఆరుగురు మృతి

13 May, 2019 14:33 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 30 మందితో వెళ్తున్న ట్రాక్టర్ దిలారీలో అదుపుతప్పి బోల్తా పడింది. నఖుంకా గ్రామంలో పుట్టిన రోజు వేడుకలు ముగించుకొని భజల్‌పూర్ గ్రామానికి తిరిగి వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాపతోపాటూ ఓ బాలుడు ఉన్నారు. మరో ముగ్గురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు జ్యోతి(6నెలలు), మోను(10), బిస్మా(50), పరమేశ్వరి(40), గబ్బర్‌(35), షీలా(40)గా గుర్తించారు.

మరిన్ని వార్తలు