సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

14 Sep, 2019 09:09 IST|Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

తల్లిదండ్రులను కష్టపెట్టలేక..

ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ...

కేపీహెచ్‌బీకాలనీ: నచ్చని ఉద్యోగం చేయలేక, తల్లిదండ్రులను కష్టపెట్టలేక మనస్తాపానికిలోనైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లేఖరాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా, దువ్వాడకు చెందిన గుండ్ల వెంకట నాగ చైతన్య (23) బీటెక్‌ పూర్తి చేశాడు. ఏడాది క్రితం నగరానికి వచ్చిన అతను కేపీహెచ్‌బీకాలనీ రోడ్‌ నంబర్‌–3లో బాలాజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. స్థానికంగా కంప్యూటర్‌ కోర్సు  నేర్చుకున్న చైతన్య జూబ్లీహిల్స్‌లోని ఓ సాప్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం హాస్టల్‌లో అతడితో పాటు గదిలో ఉంటున్న చైతన్య రాత్రి రూమ్‌కు వచ్చి తలుపులు కొట్టినా తీయలేదు.

దీంతో అతను పక్కనే ఉన్న మరో గదిలో నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం మరోసారి తలుపు తట్టినా తెరవకపోవడంతో హాస్టల్‌ నిర్వాహాకులకు సమాచారం అందించాడు. వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా చైతన్య సీలింగ్‌ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకొని కనిపించాడు. అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు చైతన్య గదిలో  సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘తాను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదని, ఊరికి వెళ్లి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొ న్నాడు. అంతే కాకుండా ‘నాన్నా.. అమ్మా..అక్క జాగ్రత్త అంటూ అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.  వారి కుటుంబసభ్యులు వచ్చిన తర్వాతే చైతన్య మృతికి కారణాలు  తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మింగేసిన బావి

స్నేహాన్ని విడదీసిన మృత్యువు

అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...

నవవరుడికి చిత్రహింసలు

టీచర్‌పై విద్యార్థి లైంగికదాడి యత్నం

మిఠాయిలో పురుగుల మందు కలుపుకుని..

తెల్లారిన బతుకులు

ప్రాణాలు తీసిన నిద్రమత్తు

ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజేష్ చౌదరి అరెస్ట్‌ 

ఎస్‌ఐని చితకబాదిన మహిళలు

కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

కాకినాడలో విషాదం

బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

రాజస్థాన్‌లో పాక్‌ గూఢచారి అరెస్ట్‌

వివాహిత హత్య.. ప్రియుడే హంతకుడు..

ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన

న్యాయవాది అనుమానాస్పద మృతి

ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తానంటూ రూ.15లక్షల టోకరా

18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పక్కదారి పడుతున్న గృహావసర సిలిండర్లు

విశాఖలో బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌

గల్ఫ్‌లో శ్రమ దోపిడీ

వివాహిత దారుణ హత్య

వోల్వో వేగం.. తీసింది ప్రాణం

నేరస్తులను పట్టుకునేదెన్నడు?

నీరవ్‌కు మరో దెబ్బ, నేహాల్‌పై రెడ్‌ కార్నర్‌ నోటీసు

పదో తరగతి విద్యార్థి కిడ్నాప్‌కు యత్నం

వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి

ఈడ్చిపడేసి, కాళ్లతో తంతూ : వైరల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నయన పెళ్లెప్పుడు?

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి

బందోబస్త్‌ సంతృప్తి ఇచ్చింది

సరికొత్త యాక్షన్‌

గెటప్‌ చేంజ్‌

పండుగాడు వస్తున్నాడు