పౌల్ట్రీఫాంపై పిడుగు.. 500 కోళ్లు మృతి

2 Jun, 2018 08:40 IST|Sakshi
పిడుగుపాటుకు గురై మృతిచెందిన కోళ్లు 

షాబాద్‌(చేవెళ్ల : పిడుగు పడి బాయిలర్‌ కోళ్లు మృ తిచెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షంలో పిడుగుపడి బాయిలర్‌ కోళ్లు మృతిచెందిన ఘటన షాబాద్‌ మండల పరిధిలోని నరెడ్లగూడలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపి న వివరాల ప్రకారం...

మండల పరిధిలోని నరెడ్లగూడ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల చంద్రలింగం పౌల్ట్రీఫామ్‌లో పిడుగుపాటుకు గురై సుమారు 500 వరకు కోళ్లు మృతి చెందాయి. తమను ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అప్పులు చేసి కోళ్ల పరిశ్రమను నడిపిస్తున్న తమకు పిడుగు రూపాన తీరని నష్టం ఏర్పడిందని వాపోతున్నారు.  

పిడుగుపాటుకు గురై ముగ్గురు మహిళలకు గాయాలు... 

పిడుగుపడి ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన షాబాద్‌ మండల పిరిధిలోని ఆస్పల్లిగూడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఆస్పల్లిగూడ గ్రామానికి చెందిన రైతు పొలంలో గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన కొందరు మహిళలు కూలీ పనులు చేస్తుండగా సాయంత్రం ఈదులు గాలులు, వర్షం కురవడంతో వారంతా పక్కనే ఉన్న చెట్టు కిందికి వెళ్లారు. అంతలోనే ఉరుములు రావడంతో చెట్టుపై పిడుగు పడింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన యాదమ్మ, మౌనిక, రాములమ్మలను షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు