దొంగలను చూసి అవాక్కయిన పోలీసులు

30 Mar, 2018 16:20 IST|Sakshi

ఘాజియాబాద్‌ : కాపలా ఉండాల్సిన కంచే చేనును మేస్తే ఎలా? దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీసులే దొంగతనం చేస్తే ప్రజలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఢిల్లీ ప్రజల భయం కూడా అదే. ఒక్క దొంగతనంతో  కోటీశ్వర్లు అవుదామనుకున్న ఇద్దరు పోలీసులు కటకటాలపాలయ్యారు. మార్చి 18న ఢిల్లీలోని ఓ జ్యువెలరీ షాపులో జరిగిన సుమారు 9 కేజీల బంగారం దొంగతనాన్ని ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఛేదించారు.

నిందుతులను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే వారు ఢిల్లీకి చెందిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్సెక్టర్లు సతేంద్ర సింగ్‌, బ్రహ్మ్‌ పాల్‌లు. వీరి దగ్గర్నుంచి 6 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన మరో నిందుతుడు మీరట్‌కు చెందిన శైలేంద్ర యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పదేళ్ల క్రితం జరిగిన ఓ దొంగతనం కూడా వీరే చేసారని పోలీసుల విచారణలో తేలింది. 

మరిన్ని వార్తలు