శోకసంద్రంలో వల్లూర్‌

26 Mar, 2018 14:17 IST|Sakshi

కర్ణాటక నుంచి గ్రామానికి చేరిన మృతదేహాలు

కలచి వేసిన మృతుల కుటుంబ సభ్యుల రోదనలు

మనూరు(నారాయణఖేడ్‌): కర్ణాటకలోని గుల్బర్గా సమీపంలోని జావర్గి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగల్‌గిద్ద మండలం వల్లూర్‌కు చెందిన నలుగురు వ్యక్తుల మృతదేహాలు ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకున్నాయి. ప్రమాదంలో గ్రామానికి చెందిన మేత్రి లక్ష్మి(40), ఆమె మనువడు సాయి(02)తోపాటు గొల్లపద్మ(35), సునిత(06) మృతి చెందిన విషయం తెలిసిందే.

పుట్టు వెంట్రుకలకోసం అని వెళ్లీ, ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు రోదనలు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించాయి. దశప్ప భార్య అయిన పద్మ దంపతులకు ముగ్గురు సంతనం ఉన్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇందులో దశప్ప భార్య పద్మ(35)చిన్న కూతరు అయిన సునిత(06) మరణించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు