శాడిస్ట్‌ సాఫ్ట్‌వేర్ వేధింపులు.. భార్య ఆత్మహత్య

2 Nov, 2019 18:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఓ శాడిస్ట్‌ సాఫ్ట్‌వేర్ భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. మరొక మహిళతో ఎఫైర్ పెట్టుకుని, భార్యను చనిపోవాలని భర్త తీవ్రంగా వేధించండతో భార్య తనువు చాలించింది.  వివరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న సుకిత్‌..  శివానిని ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు సంతోషంగా సాగిన వీరి వైహహిక జీవితంతో.. అక్రమ సంబంధం చిచ్చెపెట్టింది. సుకిత్‌ మరో మహిళతో ఎఫైర్‌ పెట్టుకుని శివానిని వేధించసాగాడు. భర్త సుకీత్ వేధింపులు తట్టుకోలేక శనివారం సాయంత్రం శివాని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే శివాని మృతికి సుకితే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి శివానిని ఇబ్బందులు పెడుతున్నాడని, గత ఆరు నెలల నుండి శివానికి నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే కొద్ది రోజుల కిత్రం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసిన శివాని.. సుకిత్‌కు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ వారికి తెలియజేసింది. దీంతో అప్పటి నుంచి శివానిని చనిపోవాలని, వేరే పెళ్లి చేసుకుంటానని టార్చర్ చేయసాగాడు. భర్త వేధింపులు ఎక్కువడంతో శుక్రవారం రాత్రి అంబర్‌పేట్‌లోని నివాసంలో శివాని ఉరివేసుకుని చనిపోయింది. ఈ విషయాన్ని సుకిత్‌ కుటుంబ సభ్యులు.. శివాని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే గురువారం రాత్రి 8గంటల 45 నిమిషాలకు తన సోదరితో మాట్లాడిందని.. ఉరి వేసుకోవడానికి సరిపోయేలా ఇంటి పైకప్పు లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుకిత్‌ కుటుంబ సభ్యులపై అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు