రామాయణ పరీక్ష రాసిన 1,500 మహిళలు

26 Jun, 2016 19:32 IST|Sakshi

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కాపు కల్యాణ మండపంలో వాల్మీకి రామాయణానికి సంబంధించి ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే తొలిసారిగా కేవలం మహిళలకు రామాయణంపై నిర్వహించిన పరీక్షను 1,500 మంది రాశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు దశల్లో ఈ పరీక్షను నిర్వహించారు.

 

జిల్లాలోని సీతానగరం చిట్టి బాబాజీ సంస్థానం, కోనసీమ పరమేశ్వర సేవా సమితి, అమలాపురం గౌతమ మహర్షి సంరక్షణ సమితి, హైదరాబాద్ టీఎల్పీ పబ్లిషర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి. ముంబై ఐటీ జాయింట్ కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డి, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి నరసింహప్ప, పర్యావరణ శాస్త్రవేత్త పతంజలిశాస్త్రి, సినీ సంగీత దర్శకుడు యోగేశ్వరశాస్త్రి, సీతానగరం చిట్టిబాబాజీ సంస్థానం వ్యవస్థాపకుడు జగ్గుబాబు, అమలాపురం గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు తదితరులు పరీక్షా పత్రాలను విడుదల చేసి పరీక్షను ప్రారంభించారు. కోనసీమ నలుమూలల నుంచీ మహిళలు ఉత్సాహంగా పరీక్ష రాసేందుకు వచ్చారు.
 

మరిన్ని వార్తలు