పదిమంది విద్యార్థులకు అస్వస్థత

23 Jun, 2016 16:37 IST|Sakshi

చిన్నశంకరంపేట (మెదక్) : కలుషిత ఆహారం తిని 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ధరిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజన అనంతరం కొంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చర్మంపై దద్దుర్లు(బెందులు) రావడంతోపాటు వాంతులు విరోచనాలు చేసుకున్నారు. ఇది గుర్తించిన ఉపాధ్యాయులు పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో వాడుతున్న నాసిరకం నూనె వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉంటారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు