‘అమృతబిందు’ సహకారం అభినందనీయం

19 Aug, 2016 22:40 IST|Sakshi
‘అమృతబిందు’ సహకారం అభినందనీయం
  • కలెక్టర్‌ వాకాటి కరుణ 
  • ఎంజీఎం : రాష్ట్రీయ బాలస్వస్త్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో రక్తహీనత పరీక్షించేందుకు హిమోగ్లోబిన్‌ అందిస్తున్న అమృతబిందు చారిటబుల్‌ ట్రస్టు వారి సహకారం అభిందనీయమని కలెక్టర్‌ వాకాటి కరుణ అన్నారు. జిల్లాలోని 16 ఆర్‌బీఎస్‌కే విభాగాలకు 16 హిమోగ్లోబిన్‌ మీటర్లను శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో అమృత బిందు ట్రస్ట్‌ బాధ్యులు సురేశ్‌ కలెక్టర్‌ చేతుల మీదుగా డీఎంహెచ్‌ఓ సాంబశివరావుకు అందించారు.
     
    ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమన్నారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ 19 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో నిర్వహించే పరీక్షలతో పాటు  హిమోగ్లోబిన్‌ మీటర్ల సహాయంతో రక్తహీనత గల పిల్లలను గుర్తించవచ్చని అన్నారు. అలాంటి వారికి ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు సమీర్‌కుమార్, దేవి, అశోక్‌రెడ్డి, అనిల్, సంతోష్‌ పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు