ప్రభు భక్తి

24 Jul, 2016 22:44 IST|Sakshi
ప్రభు భక్తి

సాక్షి ప్రతినిధి, కడప:
సుండుపల్లె మండలం తిమ్మసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం పార్టీ ఫిరాయింపు కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితోపాటు ఏఎస్పీ సిద్దారెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పంచాయతీ మాజీ సర్పంచ్‌ శాంతమ్మతోపాటు మరికొందరు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. కాగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండీ నడిపించిన ఏఎస్పీ సిద్దారెడ్డికి టీడీపీలో చేరిన వారు సమీప బంధువులుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల సిద్దారెడ్డికి ఏఎస్పీగా తిరుపతికి పోస్టింగ్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి నజరానాగా ఏఎస్పీ స్వగ్రామంలోని బంధువులను టీడీపీలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఆ మేరకే అత్యంత క్రమశిక్షణ కల్గిన పోలీసు శాఖలో పని చేస్తూ¯ó... టీడీపీ చేరికల కార్యక్రమానికి హాజరైయ్యారని సమాచారం.
భక్తి చాటుకోవడంతో పోటీతత్వం....
పోలీస్‌ శాఖలో ప్రభు భక్తి చాటుకోవడంలో పోటీతత్వం పెరిగిందని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇలాంటి ఉదంతం మైదుకూరు పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అధికారులుగా విధులు నిర్వర్తించడంతో ఇలాంటి దుస్థితి తెరపైకి వచ్చింది. టీడీపీ నేత తనయుడు ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులు పోటీ పడీ అభిమానం చాటుకున్నట్లు తెలుస్తోంది. ఖాకీ దుస్తుల్లో ఉంటూనే బహిరంగంగా ప్రజలంతా చూస్తుండగా యువనేతకు సెల్యూట్‌ చేసి అభాసుపాలైనట్లు సమాచారం. ఎలాంటి హోదా లేకపోయినా పోలీసు అధికారులు వారి విలువను తగ్గించుకుంటూ నలుగురిలో నవ్వులు పాలైతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా శాఖ పరువును ఇనుమడింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

 

మరిన్ని వార్తలు