నల్లమల సిగలో అగ్ని శిఖ

15 Sep, 2016 19:55 IST|Sakshi
నల్లమల సిగలో అగ్ని శిఖ
ఆత్మకూరు రూరల్‌: మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. పచ్చటి నల్లమల అడవులను తాకుతూ.. కొండల మీదుగా వెళ్తున్న మేఘాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని నాగలూటి–బైర్లూటి ప్రాంతంలో ఔషధ మొక్క శంకర పుష్పి(అగ్ని శిఖ) అత్యంత రమణీయంగా కనువిందు చేస్తోంది. అరవిరిసిన అగ్నిశిఖ పుష్పాలపై నీటి బిందువులు ఎర్రని ముత్యాలను తలపిస్తున్నాయి. ఆగి ఆగి కురుస్తున్న వర్షం.. అగ్నిశిఖ అందం నల్లమల సౌందర్యాన్ని రెట్టింపు చేస్తోంది.
 
మరిన్ని వార్తలు