సేవలతో మెరి‘షి’

3 Jan, 2017 23:12 IST|Sakshi
  • సావిత్రీ బాయి ఫూలే అవార్డు అందుకున్న ఉపాధ్యాయినులు 
  • తొలిమహిళా ఉపాధ్యాయినిగా, మహిళా పాఠశాలను స్థాపించి ఎందరో మహిళా విద్యావేత్తలను సమాజానికి అందించిన ఆదర్శ ఉపాధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. మహాత్మా జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఆదర్శ సతీమణి. ఆమెను ఆదర్శంగా తీసుకున్న జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయినులు అభాగ్యులకు ఆసరాగా.. బడి బయట పిల్లలకు దిక్సూచిలా.. విధి వంచించిన అబలలకు మార్గదర్శిలా నిలిచి అరుదైన పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సావిత్రీబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. వారే తళ్లా ఉమారాజ మంగతాయారు, బచ్చు ఉమాశ్రీదేవి. 
    – భానుగుడి(కాకినాడ)
     
    తళ్లా..సేవలు భళా
    స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో ఉన్న తళ్లా ఉమారాజ మంగతాయారు 28 ఏళ్లుగా జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. బాల కార్మిక నిర్మూలన, మహిళా సాధికారికత, బాలికా విద్య, బాల్యవివాహాల నిర్మూలన వంటి అంశాలపై జిల్లాలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కాకినాడ జనశిక్షణ సంస్థ ద్వారా వంద మంది మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ నిచ్చి ఉపాధి చూపారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు, నిరక్షరాస్యత నిర్మూలనకు అక్షర గోదావరి, అక్షర భారతి, అక్షర సంక్రాతి వంటి కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించారు. కమ్యూనిటీ మొబలైజేష¯ŒS ద్వారా పాఠశాలల నిర్మాణం, సమాజంలో మహిళలు, బాలికల వివక్ష పట్ల గ్రామాల్లో పలు అవగాహన కార్యక్రమాలు సొంతంగా నిర్వహిస్తున్నారు.
    సత్కారాలెన్నో..!
    2008లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా, లయ¯Œ్స క్లబ్, రోటరీ క్లబ్, రాజమండ్రి కళాక్షేత్రంS ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయినిగా చేబ్రోలు, వీరవరం, గొల్లప్రోలు, తాటిపర్తి తదితర పాఠశాలల్లో పనిచేసి ఉత్తమ బోధనతో పాటు, విద్యాభివృద్ధిలో ఆమె చేసిన ప్రగతికిగాను సావిత్రీబాయి ఫూలే అవార్డును అందుకున్నారు.
     
    సేవల సిరి.. ఉమాశ్రీ
    సావిత్రీబాయి çఫూలే ఆదర్శంగా 23 ఏళ్ల పాటు ఎస్జీటీగా జిల్లాలో సేవలందిస్తున్న బచ్చు ఉమాశ్రీదేవి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఈస్ట్‌ చోడవరంలో ఉద్యోగవృత్తిని ప్రారంభించారు. బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ఈమె ఎస్జీటీ కేడర్‌లో అవార్డును అందుకున్నారు. కాకినాడ రూరల్‌ మండలం పండూరు, కొవ్వూరు, కాజులూరు మండలం ఐతిపూడి, పెదపూడి మండలం లక్షీ్మనరసాపురంలలో పనిచేశారు. 23 ఏళ్లుగా రామకృష్ణ మఠంలో శాశ్వత సభ్యురాలిగా పలు సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే కోకనాడ అన్నదాన సమాజంలో మేజర్‌డోనర్‌గా అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. అలయ¯Œ్స క్లబ్‌ జిల్లా కార్యదర్శిగా సేవలందిస్తూ, ఓలే్డజ్‌ హోమ్‌ల నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. 2013 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా, 2015 పడాల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పురస్కారం, 2016 రాజమండ్రి ఫిలాంత్రోఫిక్‌ సొసైటీ ఆ««దl్వర్యంలో బెస్ట్‌ టీచర్‌గా, ఫియలాజికల్‌ వర్సిటీ హైదరాబాద్‌ వారిచే ఇంటర్‌నేషనల్‌ లైఫ్‌ ఎచీవ్‌మెంట్, మధర్‌ థెరిస్సా ఫౌండేష¯ŒSచే ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డులను అందుకున్నారు.
     
మరిన్ని వార్తలు