బీఎస్‌ఎన్ ఎల్‌ బంపర్‌ ఆఫర్స్‌

25 Feb, 2017 23:19 IST|Sakshi
బీఎస్‌ఎన్ ఎల్‌ బంపర్‌ ఆఫర్స్‌

సాక్షి, సిటీ బ్యూరో:  బీఎస్‌ఎన్ పర్‌ ఆఫర్స్‌ ప్రకటించింది. ప్రైవేటు టెలికాం కంపెనీలకు ధీటుగా మొబైల్‌ సేవలను విస్తరించేందుకు చర్యలకు ఉపక్రమించినట్లు పీజీఎం రాంచంద్ర తెలిపారు.

ఆల్‌ఫ్రీ ప్లాన్ ...
ఆల్‌ ఫ్రీ ప్లాన్  పేరుతో రూ.144 వోచర్లకు 30 రోజుల కాలపరిమితితో అన్నిరకాల నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలపాటు ఉచితంగా మాట్లాడుకునే సదుపాయం కలదు. 90 రోజుల కాలపరిమితితో రూ.439 వోచర్‌కు అన్ని రకాల నెట్‌వర్క్‌లకు  రోజుకు 30 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. ఆఫర్‌ మార్చి 31 వరకు వర్తిస్తుంది.

స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌...
28 రోజుల కాలపరిమితితో రూ.339 వోచర్‌పై అన్ని రకాల నెట్‌వర్క్‌లకు అపరిమిత ఉచిత కాల్స్‌తోపాటు 1జీబీ డాటాను అందిస్తోంది. రూ.139 వోచర్‌పై బీఎస్‌ఎన్ ఎల్‌ నెట్‌వర్క్‌కు పరిమితి లేకుండా ఉచిత కాల్స్‌తో పాటు 300 ఎంబీ డాటా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ మార్చి 17 వరకు ఉంటుంది.  

ఫుల్‌ అదనపు టాక్‌టైమ్‌...
రూ. 220, రూ. 2000, రూ.2200, రూ. 2500, రూ.3000 టాప్‌ఆప్‌పై ఫుల్‌ టాక్‌ టైమ్, రూ. 550 టాప్‌ఆప్‌పై 575, రూ. 1100లకు 1200లు, రూ.3300లకు 3500, రూ.5500 లకు 6000ల ఎక్స్‌ట్రా టాక్‌ టైమ్‌ లభించనుంది.

కాంబో ఎస్‌టీవీ...
ఈ ఆఫర్‌ కింద  రెండు రోజుల కాలపరిమితితో రూ. 13కు 15 రూపాయల టాక్‌టైమ్, 10ఎంబీ డాటా, 10 రోజుల కాలపరిమితి గల రూ.77 వోచర్‌కు  రూ. 80 టాక్‌టైమ్,  30 ఎంబీల డాటా, 15 రోజుల కాలపరిమితితో  రూ.177 వోచర్‌కు రూ. 180 టాక్‌ టైమ్‌తోపాటు 50 ఎంబీ డాటాను అందిస్తోంది. ఈ ఆఫర్‌ మార్చి 31 వరకు ఉంటుంది. రూ. 30 రోజుల కాలపరిమితితో 1099 విలువగల ఎస్‌టీవీకి అన్  లిమిటేడ్‌ డాటా స్పీడ్‌  ప్రకటించింది.

డబుల్‌ డాటా ఆఫర్స్‌..
ఎస్‌టీవీ కింద డబుల్‌ డాటా ఆఫర్స్‌ ప్రకటించింది. ఏడాది కాలపరిమితిలో రూ. 4498 వోచర్‌కు 80 జీబీలు. రూ. 3998లకు 60 జీబీలు, 2798లకు 36 జీబీలు,  1498లకు  18జీబీల డాటా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ మార్చి 31 వరకు ఉంటాయి. కొత్త కనెక్షన్లకు 300 ఎంబీ డాటా ఉచితంగా అందిస్తోంది.  5 రోజుల కాలపరిమితి గల రూ.78లకు 2జీబీ, 14 రోజుల కాలపరిమితితో రూ.98లకు 2జీబీ, 15 రోజుల  కాలపరిమితితో రూ.155లకు 2జీబీ, 10 రోజుల కాలపరిమితితో రూ.156లకు 3జీబీ, 29 కాలపరిమితితో రూ. 198లకు 3జీబీ, 28 కాలపరిమితితో రూ.198లకు 3జీబీ, 28 కాలపరిమితితో రూ. 291లకు 8జీబీ, 60 రోజుల కాలపరిమితి గల రూ. 444లకు 8జీబీలు, 60 రోజుల కాలపరిమితితో రూ.451లకు 6జీబీ, 80 టాక్‌టైమ్, 30 రోజుల కాలపరిమితితో రూ.549లకు 15జీబీ,  60 రోజుల కాలపరిమితితో రూ.561లకు 11జీబీ, 60 రోజుల కాలపరిమితితో రూ.821లకు 15జీబీ, 30 రోజుల కాలపరిమితితో రూ. 3099లకు 20జీబీ డాటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, ఉచిత కాల్స్‌ వర్తిస్తాయి.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు