కాలుష్య కంపెనీలను మూసివేయాలి

27 Sep, 2016 21:58 IST|Sakshi
కాలుష్య కంపెనీలను మూసివేయాలి
నల్లగొండ రూరల్‌ : విష పదార్థాలు వెదజల్లే కంపెనీలను మూసివేయాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ఏపూరు గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్‌లోని దీవిస్‌ కంపెనీ నుంచి విష వ్యర్థాలు విడుదలవుతున్నాయని, వీటి వల్ల గుండ్రాంపల్లిలోని ఏపూరు గ్రామ చెరువులో రూ. 12 లక్షల విలువైన చేపలు చనిపోయాయని అన్నారు. ఈ విషయమై అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం డీఆర్‌ఓ రవినాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, నగేష్, రవి, లింగస్వామి పాల్గొన్నారు. 
 
 
 
 
>
మరిన్ని వార్తలు