ప్రకృతి వ్యవసాయానికి క్లస్టర్ల ఏర్పాటు

21 Aug, 2016 23:30 IST|Sakshi
ప్రకృతి వ్యవసాయానికి క్లస్టర్ల ఏర్పాటు
నంద్యాలరూరల్‌:  ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రీయత కోసం క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఎన్‌వీ నాయుడు తెలిపారు. ఆదివారం నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఏడీఆర్‌ గోపాల్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల సమావేశంలో మాట్లాడారు. తంగడంచలో సీడ్‌ హబ్‌కు 500 ఎకరాలు కేటాయించగా ఇప్పటికే 300 ఎకరాల్లో నవధాన్యాల ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలను ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించామన్నారు. వాటి శాస్త్రీయతను పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు.  రాయలసీమతోపాటుపాటు ప్రకాశం జిల్లాలో కూడా నవధాన్యాల ఉత్పత్తికి యూనివర్సిటీ పరిధిలో చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగును తగ్గించామని, ఇంకా తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో రైతులకు పరిశోధన ఫలాలు అందేలా చూడాలని నాయుడు ఆదేశించారు. సమావేశంలో ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్‌ రాజారెడ్డి, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు