19న కాంక్రీట్‌ పనులు ప్రారంభం

9 Dec, 2016 02:45 IST|Sakshi
19న కాంక్రీట్‌ పనులు ప్రారంభం
పోలవరం రూరల్‌ : పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో ఫౌండేష¯ŒSకు సంబంధించి కాంక్రీట్‌ పనులను ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను ఆయన గురువారం పరిశీలించారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్, అప్రోచ్‌ చానల్, డ్యామ్‌ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించి పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంక్రీట్‌ పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ఉమాభారతి, వెంకయ్యనాయుడును ఆహ్వానించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం పనులకు రూ.2,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కాంక్రీట్‌ నిర్మాణం పనులకు 18వేల మెట్రిక్‌ టన్నుల ఇనుము, 10 లక్షల టన్నుల సిమెంట్‌ సిద్ధం  చేస్తున్నామన్నారు. డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలోనే గేట్లు తయారు చేస్తారన్నారు.  రోజూ 2లక్షల 10వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో 14,828 వేల ఎకరాల భూమి సేకరించామని, పాత భూసేకరణ చట్టం ప్రకారం రూ.520 కోట్లు ఖర్చు అయ్యిందని పేర్కొన్నారు. ఇంకా కుక్కునూరు, వేలేరు పాడు ప్రాంతాల్లో 12వేల ఎకరాలు భూమి సేకరించాల్సి ఉందన్నారు. నెలలో భూసేకరణ పనులు పూర్తిచేస్తామన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎకరానికి రూ. 10.50 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. పనుల పరిశీలన అనంతరం ట్రా¯Œ్సట్రాయ్‌ ఏజెన్సీ కార్యాలయంలో ఇరిగేష¯ŒS అధికారులు , ఏజెన్సీ ప్రతినిధులతో పనులు జరుగుతున్న తీరుపై ఉమామహేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, ప్రాజెక్టు సీఈ ఎస్‌.హరిబాబు, ఏఎంసీ చైర్మ¯ŒS పారేపల్లి రామారావు, ఎంపీపీ పైల అరుణకుమారి, జెడ్పీటీసీ కుంజం సుభాషిణి, ఆర్డీవో ఎస్‌.లవన్న, డీఎస్పీ కేటీవీ రవికుమార్, డిప్యూటీ ఎస్‌ఈ కె.వెంకటేశ్వరరాజు, ఈఈ పి.మునిరెడ్డి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు