జయశంకర్‌ జిల్లా కార్యాలయాలకు హంగులు

23 Sep, 2016 00:59 IST|Sakshi
జయశంకర్‌ జిల్లా కార్యాలయాలకు హంగులు
  • గోడలకు రంగులు.. గదుల్లో ఏసీల ఏర్పాటు 
  • తాత్కాలిక భవనాలకు కొనసాగుతున్న మరమ్మతులు
  • మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తి
  • భూపాలపల్లి : కొత్తగా ఏర్పాటవుతున్న ఆచార్య జయశంక ర్‌ జిల్లా తాత్కాలిక కార్యాలయాల్లో మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. అక్టోబర్‌ 1లోపు జిల్లా కార్యాలయాలను అన్ని విధాలుగా సిద్ధం చేసి 11 నుంచి పాలన కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు స్థానిక రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు పనులను ముమ్మరం చేశారు. మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తవుతాయని స్థానిక రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు.
     
    కలెక్టరేట్‌లో చురుగ్గా పనులు.. 
    భూపాలపల్లి పట్టణంలోని మంజూర్‌నగర్‌లో ఉన్న ఇందూ అతిథిగృహంలో కింది అంతస్తు మొత్తాన్ని కలెక్టరేట్‌కు కేటాయించారు. ఇందులో కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓ, ఏఓ, కలెక్టర్‌ కార్యాలయ సెక్షన్లు, వీడియో, సమావేశపు గదులకు కేటాయించారు. అలాగే పై అంతస్తులో డీఎం సీఎస్, డీఎస్‌ఓ, డీపీఓ, ఎ¯ŒSఐసీ వీసీ, రికార్డ్సŠ, ఐఅండ్‌పీఆర్, డీఆర్‌డీఏ, సీపీ ఓ శాఖలకు కేటాయించారు. ఆయా శాఖలకు కేటాయిం చిన గదుల్లో పనులు త్వరితగతిన సాగుతున్నాయి. ఇందూ అతిథిగృహంలోని 32 గదులకు నంబర్లు రాయించారు. అలాగే భవనం చుట్టూ పూల మొక్కలను నాటేందుకు ప్రస్తుతం ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. కలెక్టర్, జేసీకి కేటాయించిన గదుల్లో ఏసీలను ఏర్పాటు చేశారు. భవనం కొత్తదే అయినప్పటికీ ఇప్పటివరకు వినియోగంలో లేదు. దీంతో మరో మారు గదుల్లో పెయింటింగ్‌ చేస్తున్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయ నున్న తహసీల్దార్‌ కార్యాలయం వెనక భాగంలోని దేవాదుల డేటాబేస్‌ సెంటర్‌ భవనంలో పనులు కొనసాగుతున్నాయి. ఈ భవనంలో గోడలకు పగుళ్లు రావడంతో రెండు రోజులుగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కార్యాలయం చుట్టూ మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డీఓ గదిలో ఏసీని ఏర్పాటు చేశారు. ఇందులో మరో మారు రంగులు వేయిస్తున్నారు.
     
    సిద్ధంగా ఐటీఐ భవనం..
    భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ భవనంలో టూరిజం, జీఎం ఇండసీ్ట్రస్, ట్రెజరీ, వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్, ఆర్‌అండ్‌బీ, వ్యవసాయశాఖ, మార్కెటింగ్, మైనింగ్, కోఆపరేటివ్‌ కార్యాలయాలకు కేటాయించారు. అయితే ఈ భవనంలో నిర్మాణ, మరమ్మతు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో అధికారులు భవనానికి తాళం వేసి ఉం చారు. ఇదిలా ఉండగా, ఎస్పీ కార్యాలయానికి కేటాయించిన సింగరేణి మైనింగ్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. పోలీసు ఉన్నతాధికారులు రెండు రోజుల్లో భవనాన్ని పరిశీలించి పనులు చేయించనున్నట్లు తెలిసింది.
     
    కొత్త భవనాలతో తప్పిన తంటా.. 
    నూతనంగా ఏర్పాటవుతున్న ఆచార్య జయశంకర్‌ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు కొత్త భవనాలు రెడీగా ఉండడంతో అధికారులకు తిప్పలు తప్పాయి. సింగరేణి ఇందూ అతిథి గృహం, ప్రభుత్వ ఐటీఐ, దేవాదుల డాటా బేస్‌ సెంటర్‌ భవనాలు నిర్మించి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వినియోగంలో లేవు. ఇంతకాలం అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా భవనాల్లో మరమ్మతు పనులు పెద్ద మొత్తంలో చేపట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.
>
మరిన్ని వార్తలు