ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులకు టోల్‌ఫ్రీ నంబర్లు | Sakshi
Sakshi News home page

ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులకు టోల్‌ఫ్రీ నంబర్లు

Published Fri, Sep 23 2016 12:53 AM

for area hospitals tollfree numbers

ఏలూరు అర్బన్‌ : రోగులకు ఆసుపత్రుల సేవలు వేగంగా, సకాలంలో అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.కోటేశ్వరి తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులకు టోల్‌ ఫ్రీ నంబర్లు కేటాయిం చిందని చెప్పారు. ఇకపై రోగులు ఆ నంబర్లకు కాల్‌ చేసినా ఎటువంటి కాల్‌ చార్జీలు ఉండవన్నారు. ఆసుపత్రులకు కేటాయించిన నంబర్లు ఇలా ఉన్నాయి.. జిల్లా కేంద్ర ప్ర«భుత్వాసుపత్రి–1800 4250 412, ఏరియా ఆసుపత్రులు.. తాడేపల్లిగూడెం – 1800 4250 413, తణుకు – 1800 4250 415, జ ంగారెడ్డిగూడెం–1800 4250 416. ఈ నంబర్లకు ఏ సమయంలోనైనా రోగులు వైద్య సహాయం కోసం ఫోన్‌ చేయవచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటేశ్వరి తెలిపారు.   
 

Advertisement

తప్పక చదవండి

Advertisement