‘బాతు’ కహాని!

12 Dec, 2016 15:21 IST|Sakshi
‘బాతు’ కహాని!
వలస బాతుల దీనగాథ ఇది..చిత్తూరు చిల్లా నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి ఇవి మహానంది మండలం తమ్మడపల్లెకు వచ్చాయి. కోతకోసిన వరిపొలాల్లో వడ్ల గింజలు ఏరుకుతింటున్నాయి. స్థానిక చెరువులో సందడి చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం నంద్యాల–మహానంది రహదారిలో గుంపులు గుంపులుగా తిరుగుతూ కనువిందు చేస్తున్నాయి. ప్రతి రోజూ బాతులకు దాణా ఇచ్చేందుకు వెయ్యి రూపాయల వరకు ఖర్చు వస్తుందని, కరువు కాలంలో అంత ఆర్థిక స్థోమత లేక తాము ఇక్కడికి వచ్చినట్లు పెంపకందారులు తెలిపారు. మూడు నెలల వరకు ఇక్కడే ఉంటామని, ఇందు కోసం తాత్కాలిక గుడారాలను సైతం వేసుకున్నట్లు వీరు చెప్పారు. - మహానంది
 
మరిన్ని వార్తలు