వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి

1 Sep, 2016 00:15 IST|Sakshi
  • రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతరావు
  • హన్మకొండ : వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు అన్నారు. బుధవారం హన్మకొండలోని జిల్లా ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో సీనియర్‌ సిటిజెన్స్‌ ఫోరం జిల్లా కమిటీ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పౌరుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చిందన్నారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలోనూ వయోవృద్ధులు కీలక పాత్ర పోషించారన్నారు
     
    వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులుగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన వారు ఈ ఫోరంలో ఉన్నారన్నారు. సీనియర్‌ సిటిజెన్స్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.చంద్రమౌళి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు నాలుగు సీట్లు కేటాయించాలన్నారు. బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో టికెట్లు తీసుకోవడానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. వేడుకల్లో సీనియర్‌ సిటిజెన్స్‌ ఫోరం నాయకులు ఉప్పల గోపాల్‌రావు, అంపశయ్య నవీన్, ఎన్‌.భూమారెడ్డి, పరమాజీ, పి.వి.శ్రీనివాస్, కంది యాదిరెడ్డి, కనకయ్య, రాజమల్లారెడ్డి, దేవాచారి, రామ్మూర్తి, వీరభద్రారెడ్డి, బర్కతుల్లా, షరీఫ్, విజయ్‌కుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు