వ్యాయామంతో వ్యాధులు దూరం

16 Nov, 2016 22:21 IST|Sakshi
  • ఎవరెస్ట్‌ అధిరోహకురాలు నీలిమ
  • బ్రెస్ట్‌ కాన్సర్‌పై అవగాహన పెంచేందుకు పింక్‌థాన్‌ 
  • విజయవాడ నుంచి విశాఖకు పరుగు
  • తొండంగి : 
    ఒకనాడు ప్రపంచంలో అత్యున్నతమైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి, తెలుగు వారి కీర్తిని ఇనుమడింపజేసిన పాదాలు.. నేడు అనేక మంది మహిళలకు మృత్యుశాసనాన్ని రాస్తున్న మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు పరుగుతీస్తున్నాయి. గుంటూరుకు చెందిన ఎవరెస్ట్‌ అధిరోహకురాలు పూదోట నీలిమ మహిళలకు బ్రెస్ట్‌ కేన్సర్‌పై అవగాహన కల్పించాలన్న సంకల్పంతో విజయవాడ నుంచి విశాఖకు చేపట్టిన పింక్‌«థాన్‌పరుగు బుధవారం మండలంలోని బెండపూడి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. మహిళల్లో అనేకులు బ్రెస్ట్‌ క్యాన్సర్, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారన్నారు. ఎటువంటి వ్యాధులనైనా కొద్దిపాటి శారీరక వ్యాయామంతో దూరం చేసుకోవచ్చన్నారు. మహిళలకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈనెల 12న విజయవాడ నుంచి పింక్‌థాన్‌(మహిళలు మాత్రమే చేసే పరుగు) ప్రారంభించానన్నారు. రోజుకు సరాసరి యాభై కిలోమీటర్ల  చొప్పున వారంరోజుల పాటు పింక్‌థాన్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 18 కల్లా విశాఖ చేరుకుంటానన్నారు. ఈనెల 20న అక్కడ విజయా మెడికల్స్‌ ఆధ్వర్యంలో జరిగే అవగాహనా కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. కాగా తనతో పాటు 10 కిలోమీటర్లు పింక్‌థా¯ŒSలో పాల్గొన్న వారికి ఉచితంగా పలు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతోపాటు వ్యాయామం ద్వారా కలిగే ప్రయోజనాలను   చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. అంనతరం విశాఖకు పింక్‌ థా¯ŒSను కొనసాగించారు.
     
మరిన్ని వార్తలు