ఖరీఫ్‌కు ఎరువులు, విత్తనాలు సిద్ధం

25 Apr, 2016 20:20 IST|Sakshi

-వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని వెల్లడి

నర్సాపూర్ రూరల్

వచ్చే ఖరీఫ్ కోసం ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచామని వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శిని తెలిపారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా నర్సాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

 ఈ సారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఖరీఫ్ నాటికి రైతులను సమాయత్తం చేసేందుకు ‘మన తెలంగాణ- మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మూడు ఎకరాల్లో పాలీహౌస్ ఏర్పాటు చేసుకున్న ఓసీ రైతులకు 80శాతం, బీసీలకు 90శాతం, ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు తెలిపారు. 12 ఎకరాల వరకు డ్రిప్‌పై సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రైతులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నామని తెలిపారు.

 

మరిన్ని వార్తలు