వారంలో జియో ట్యాగింగ్‌ పూర్తి

4 Sep, 2016 00:58 IST|Sakshi
వారంలో జియో ట్యాగింగ్‌ పూర్తి
 
  • డ్వామా పీడీ హరిత
 
నెల్లూరు(అర్బన్‌): జిల్లాలోని రైతులకు చెందిన అన్ని రకాల వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు/ టెక్నికల్‌ సిబ్బంది వారం లోపు జియోట్యాగింగ్‌ను పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం దర్గామిట్టలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిల్టర్‌ పాయింట్లు, బోరు బావులు, ఓపెన్‌ బావులు, కాలువలపై ఉంచిన మోటార్ల కనెక్షన్లకు సంబంధించి 100 శాతం జియోట్యాగింగ్‌ను వారం లోపు పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో 1,61,376 కనెక్షన్లు ఉన్నాయని, గత రెండు రోజుల్లో 21,800 కనెక్షన్లు జియోట్యాగింగ్‌ చేశార ని తెలిపారు. దీని వల్ల రైతులు వేసిన పంటల రకాలు, భూవిస్తీర్ణం, మెట్ట, మాగాణి తదితర వివరాలతోపాటు విద్యుత్‌ ఖర్చు, నీటి వినియోగం, కరువు పరిస్థితులు తెలుసుకోవచ్చన్నారు. రైతులు ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సహకరించాలని కోరారు. సమావేశంలో అడిషనల్‌ పీడీ ప్రభాకర్‌ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు