ఉరకలేసిన ఉత్సాహం

27 Nov, 2016 23:19 IST|Sakshi
ఉరకలేసిన ఉత్సాహం

కృష్ణా తరంగ్‌–2016లో భాగంగా కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్‌ ఆవరణలో నిర్వహించిన యువజనోత్సవాల్లో రెండోరోజు ఆదివారం కూడా విద్యార్థుల ఉత్సాహం అంబరాన్నంటింది. ఉర్రూతలూగే పాటలు, జానపద నృత్యాలు, అబ్బురపరిచే చిత్రలేఖనం, వీణా వాయిద్యం, నాటికలతో క్యాంపస్‌ ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది. వర్సిటీ పరిధిలోని అన్ని అంతర్‌ కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. వెస్ట్ర¯ŒS గ్రూప్‌ సాంగ్‌ పోటీల విభాగంలో విజయవాడ కేబీఎ¯ŒS కళాశాల విద్యార్థులు ఆలపించిన ‘భాహామా వ¯ŒS వే టికెట్‌’ పాట, విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు ఆలపించిన ‘వాకా.. వాకా.. (షకీరా)’ పాట ఆకట్టుకుంది. నాటికల విభాగంలో విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘కాంట్రవర్శి’ నాటిక ఆలోచింపజేసింది. ఈ విభాగంలో కేబీఎ¯ŒS కళాశాల విద్యార్థులు ‘అనగనగా..’, నలందా విద్యార్థులు ‘మాయాబజార్‌’ నాటికలకు ప్రదర్శించారు. రాత్రి జరిగిన జానపద నృత్యాలు కుర్రకారును ఊర్రూతలూగించాయి. విజయవాడ ఎస్‌డీఎంఎస్‌ సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు చేసిన ‘లంబాడి’ సంప్రదాయ నృత్యం రజింపజేసింది. ఈలలు, కేకలతో విద్యార్థులు డ్యాన్సులు చేశారు. నలందా విద్యార్థినుల ‘చక్కభజన’, సయ్యద్‌ అప్పలస్వామి కళాశాల విద్యార్థుల మిక్సింగ్‌ జానపద పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిత్రలేఖనం, క్విజ్, వీణా వాయిద్యం, డిబేట్, ఇ¯ŒSస్టాలేష¯ŒS విభాగంలో విద్యార్థులు తమ ప్రతిభ చాటారు. కాగా, క్యాంపస్‌ కళాశాల విద్యార్థుల దక్షిణ భారతదేశ సంప్రదాయ వస్త్రధారణ, విజయవాడ నలందా విద్యార్థుల రాజస్థా¯ŒS టోపీలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వీసీ సుకరి రామకృష్ణారావు పాల్గొన్నారు.   – మచిలీపట్నం సబర్బ¯ŒS   
 

మరిన్ని వార్తలు