రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

15 Sep, 2016 22:50 IST|Sakshi

హిందూపురం రూరల్‌ : మండలంలోని అప్పులకుంట గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ (30) బెంగుళూరు నిమాన్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మతి చెందినట్లు బంధువులు తెలిపారు. గత బుధవారం హిందూపురం నుంచి అప్పులకుంటకు ద్విచక్రవాహనంలో వస్తుండగా ఆటోనగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీనారాయణ గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం మతి చెందాడు.

మరిన్ని వార్తలు