జబ్బుకు అందని డబ్బు

11 Nov, 2016 03:13 IST|Sakshi
 నిబంధనల సాకుతో వైద్యానికి డబ్బు ఇవ్వని బ్యాంకు సిబ్బంది
  చికిత్సకు రూ.30 వేలు అవసరమన్నా రూ.10 వేలే ఇచ్చి పంపిన వైనం
 
 సాక్షి, మెదక్: పెద్ద నోట్ల రద్దు, మార్పిడి వ్యవహారం ఓ కిడ్నీ రోగి ప్రాణం మీదకు తెచ్చింది! బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా వైద్యం పొందలేని దయనీ య పరిస్థితి. డయాలసిస్‌కు అవసరమైనన్ని డబ్బు లు డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులు నిరా కరించడంతో ఆమె చికిత్సకు దూరమైంది. వైద్యా నికి డబ్బులు కావాలని బతిమాలుకున్నా బ్యాంకు సిబ్బంది కనికరించకపోవడంతో కన్నీళ్లతో వెనుది రిగింది. మెదక్‌లోని ఫతేనగర్‌కు చెందిన ప్రమీలకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 2015లో హైద రాబాద్‌లోని కిమ్స్ వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ఏడాదిన్నరగా కిమ్స్‌లో చికిత్స పొందుతోంది. వైద్యుల పర్యవేక్షణలో ఇంటి వద్దే వైద్యం చేయించుకోవచ్చు. అయితే ప్రతినెలా ఓసారి డయాలసిస్ పైప్ మార్చుకోవటంతోపాటు డయాలసిస్ కిట్లు కొనుగోలు చేయాలి. 
 
 ఈ నెల 9న ప్రమీల డయాలసిస్ కోసం కిమ్స్‌కు వెళ్లాల్సి ఉంది. బ్యాంకుల బంద్ ఉండటంతో వెళ్లలేదు. గురువారం డబ్బులు డ్రా చేసుకుని కిమ్స్ వెళ్లాలనుకుంది. మెద క్ ఎస్‌బీహెచ్ బ్యాంకులోని తన ఖాతాలో రూ.35 వేల డబ్బులు ఉండటంతో రూ.30 వేలు డ్రా చేసు కుందామని భర్త ప్రేమ్‌కుమార్‌తో కలిసి స్థానిక రాంనగర్‌లోని ఎస్‌బీహెచ్ బ్యాంకుకు వెళ్లింది.  అరుుతే బ్యాంకు సిబ్బంది కేవలం పది వేలు మాత్రమే డ్రా చేసుకునేందుకు అవకాశం ఉం దన్నారు. తన ఖాతాలో రూ.35 వేలు ఉన్నాయని, వైద్యం కోసం తనకు తక్షణం రూ.30 వేలు అవస రమని బ్యాంకు సిబ్బందిని వేడుకుంది. అయినా సిబ్బంది ససేమిరా అనటంతో అకౌంట్ నుంచి రూ.10 వేలు డ్రా చేసుకుంది. మరో రెండు రోజులు ఆగితేగానీ ప్రమీల రూ.20 వేలు డ్రా చేసుకోలేని పరిస్థితి.
 
 వైద్యానికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా?: ప్రేమ్‌కుమార్
 ‘‘నా భార్య ప్రమీలకు ప్రతినెలా డయాలసిస్ కిట్‌లు కొనుగోలు చేయటంతోపాటు పైప్ మార్చుకోవాలి. డయాలసిస్ కిట్లకు రూ.20,070, ఇంజెక్షన్‌కు రూ.5 వేలు, రవాణా చార్జీలు మరో రూ.3 వేలు అవుతుంది. మొత్తంగా రూ.30 వేల వరకు అసవరం. బ్యాంకు అకౌంట్‌లో ఉన్న డబ్బులు డ్రా చేసుకోనివ్వటంలేదు. దీంతో డయాలసిస్‌ను వారుుదా వేసుకోవాల్సి వచ్చింది’’
 
 నా వద్దకు రాలేదు:  శ్రీనివాస్, బ్యాంకు మేనేజర్
 వైద్యం కోసం డబ్బులు అవసరమని ప్రమీల తనను సంప్రదించలేదని ఎస్‌బీహెచ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. బ్యాంకు అకౌంట్‌లో నుంచి ఒకరోజు రూ.10 వేలు మాత్రమే డ్రా చేయాలన్న నిబంధన ఉంది. అయితే వైద్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి ఉంటే ఆ పత్రాలు చూపిస్తే తప్పకుండా సాయం చేసే వాళ్లమని చెప్పారు.
 
మరిన్ని వార్తలు