భక్తుల కొంగుబంగారం.. మట్టపల్లి క్షేత్రం

1 Aug, 2016 23:33 IST|Sakshi
భక్తుల కొంగుబంగారం.. మట్టపల్లి క్షేత్రం

–పంచ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటిగా..
–అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన స్వామి
మట్టపల్లి (మఠంపల్లి): నల్లగొండ, గుంటూరు జిల్లాలకు వారధిగా ఉన్న పవిత్ర కృష్ణానది తీరాన వెలసిన పంచ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖంగా బాసిల్లుతూ తెలంగాణ–ఆంధ్ర ప్రాంత భక్తుల పాలిట కొంగు బంగారంలా విలసిల్లుతోంది మట్టపల్లి మహాక్షేత్రం. మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానది ఒడ్డున అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా స్వయంభువుగా అవతరించించారు శ్రీలక్ష్మీనసింహస్వామి క్షేత్రం.  
ఆలయచరిత్ర ...
పూర్వం 1100 ఏళ్ల క్రితం మట్టపల్లి కీకారణ్యంలో భరద్వాజ మహర్షి తపస్సు చేస్తాడు.  కొంత కాలానికి కృష్ణానది ఆవలి తీరాన వెలసిన తంగెడ గ్రామాన్ని పాలించే అనుముల (దొండపాటి) మాచిరెడ్డి ప్రభువుకు స్వామివారు కలలో కనిపించి ‘నాకు ఇప్పటి వరకు దేవతలు, సప్తరుషులు పూజలు, యజ్ఞాలు చేశారు.. ఇకనుంచి మానవుల పూజలు అందుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. అందువల్ల కృష్ణానది ఆవలి వైపున కీకారణ్యంలో గృహగర్భంలో నా స్వయంవ్యక్త మూర్తి ఆవిర్భవించి ఉన్నాడు.. నీవు వెళ్లి గుహను తెరిపించాలి’ అని ఆజ్ఞాపిస్తాడు. దీంతో మరునాడు మాచిరెడ్డి ప్రభువు సకల పరివారంతో కృష్ణానది దాటి వచ్చి మట్టపల్లి అటవీప్రాంతంలో వెతికి వేసారి అలసిపోయి నది ఒడ్డున నిద్రకు ఉపక్రమించాడు. దీంతో మళ్లీ స్వప్నంలోకి వచ్చిన స్వామి వారు ఓÄæూ మాచిరెడ్డి ప్రభువు నీవు నిద్రిçస్తున్న ఆరె చెట్టుపైన గరుడ పక్షి ఉంటుంది. ఆ పక్షి మిమ్ములను చూడగానే పశ్చిమం నుంచి తూర్పుదిశకు ఎగిరిపోతుంది. అక్కడి నుంచి 10 గజాల దూరంలో గుహను తవ్విస్తే∙నా స్వయంమూర్తి కనిస్తాడు అని తెలిపాడు. దిగ్గున లేచిన ప్రభువు ఆ రకంగా ౖసైన్యంతో గుహను తవ్వించగా కీకారణ్యంలోని భయంకరమైన గుహలో వెలుగులు విరజిమ్ముతూ కొండ గట్టుకు శ్రీలక్ష్మీనసింహస్వామి యోగాసనంలో పక్కన ప్రహ్లాదుడితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. స్వయం వ్యక్త ముందు దక్షిణావశంఖం నవసాలగ్రాములు కూడా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ప్రభువు ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఇక అప్పటి నుంచి నేటికీ స్వామి వారికి ఆరె ఆకులతో పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక పూజలు ..
శ్రీమట్టపల్లి లక్ష్మీనసింహస్వామికి ప్రతి దినం  ఉదయం 7.30గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మూడు సార్లు మహానివేదన, ఆరగింపు, భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ ఉంటుంది. అంతకు ముందే ప్రతిరోజు సుప్రభాతసేవతో పాటు కృష్ణానది నుంచి తెచ్చే బిందె  తీర్థంతో యథావిధిగా పూజలు  కొనసాగిస్తారు. ఆర్జితసేవలు, ప్రసాదాలు, నిత్యాన్నదానం కొనసాగుతూ ఉంటాయి.
ఉత్సవాలు ..
  ప్రతి ఏడాది మే నెలలో వచ్చే నసింహ జయంతికి శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనసింహస్వామికి తిరుకల్యాణం జరుపుతారు. ఈ కల్యాణానికి మన జిల్లా లింగగిరి, గుంటూరు జిల్లా ముత్యాలమ్మపాడు నుంచి అనాదిగా మెట్టెలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. అంతేగాక ప్రతిఏటా డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చే తొలి ఏకాదశికి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది.
ఇతర దేవాలయాలు...
మట్టపల్లిలో శ్రీలక్ష్మీనసింహస్వామి ఆలయంతో పాటు పార్వతీ రామలింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామి, గోదాదేవి ఆలయాలున్నాయి. శ్రీరామతీర్థ సేవాశ్రమం దీనిని 1971లో పిడుగురాళ్లకు చెందిన కేశవ తీర్థస్వామి ప్రారంభించారు. ఈ ఆశ్రమంలో ప్రతి నిత్యం నరసింహోపాసన జరుగుతుంది. అదేవిధంగా హుజూర్‌నగర్‌ నుంచి మట్టపల్లి వరకు  25 కిలోమీటర్ల పొడవునా త్రివేణినగర్‌లో లక్ష్మీతిరుపతమ్మ, మఠంపల్లిలో కనకదుర్గ, పెదవీడులో సోమలింగేశ్వరాలయాలు ప్రధాన రహదారిపై పూజలందుకుంటున్నాయి.
అన్నదాన సత్రాలు ...
రాష్ట్రంలోని శ్రీశైల మహాక్షేత్రం తర్వాత అంత ప్రాముఖ్యతతో ఇక్కడ వివిధ కులాల అన్నదాన సత్రాలు నిర్మించారు. నిత్యాన్నదాన సత్రాలతో పాటు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్నదానాలు చేసే మరిన్ని సత్రాలు కూడా నిర్మించారు.
ఇతర కట్టడములు ...
జిల్లాలోనే మొట్టమొదటి సారిగా 1990లో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణమంటపాన్ని మట్టపల్లిలో నిర్మించారు.  అదేవిధంగా యాదగిరిగుట్ట దేవస్థానం కూడా 6 గదుల సత్రం నిర్మించింది.  ఇంకా జడ్‌పీ అతిథిగహం, దేవస్థాన గహాలు కూడా ఉన్నాయి.
చెన్నై ముక్కూరు స్వామి పీఠం .. ఆశ్రమం ..
 మట్టపల్లి మహాక్షేత్రంలో చెన్నైకి చెందిన ముక్కూరు  లక్ష్మీనరసింహచారియార్‌ స్వామి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రధాన ఆలయానికి పై భాగాన గోశాల ప్రక్కన నిర్మించారు. ఈపీఠాన్ని మూడేళ్ల క్రితం రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌.నరసింహన్‌ మట్టపల్లి వచ్చి ప్రారంభించారు. చెన్నైకి చెందిన తమిళనాడు భక్తులు అనునిత్యం మట్టపల్లి స్వామిని దర్శించుకొని ముక్కూరు స్వామి పీఠాన్ని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఎంతో మంది పీఠాధిపతులు ఇప్పటికీ మట్టపల్లి వచ్చి శ్రీలక్ష్మీనసింహ స్వామిని దర్శించుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు