మెడిసిన్‌లో మెదక్‌కు ర్యాంకుల పంట

15 Sep, 2016 18:58 IST|Sakshi
పల్లవిని సన్మానిస్తున్న చంద్రపాల్‌

మెదక్‌/పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించినప్పటికీ ఆ విద్యార్థులు ఆత్మస్థైయిర్యం కోల్పోకుండా మెట్టు మెట్టు పైకెక్కుతూ ర్యాంకుల పంట పండించారు. మెదక్‌ పట్టణానికి చెందిన తొడుపునూరి పల్లవి గురువారం వెలువడిన ఎంసెట్‌ (మెడిసిన్‌)3లో రాష్ట్రస్థాయిలో 246వ ర్యాంకు సాధించింది. పట్టణానికి చెందిన సురేష్‌-మధురాణి దంపతుల రెండవ కూతురైన పల్లవి హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో టెన్త్, ఇంటర్‌ చదివింది.

ఇంటర్‌లో 979/1000 సాధించింది. కాగా మొదటి ఎంసెట్‌-1లో 786వ ర్యాంకు, ఎంసెట్‌-2లో 997ర్యాంకు, ఎంసెట్‌-3లో 246వ ర్యాంకును పల్లవి సాధించింది. ఈ సందర్భంగా పల్లవిని కుటుంబ సభ్యులతోపాటు రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తొడుపునూరి చంద్రపాల్, ద్వారకా చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ మ్యాడం బాలకృష్ణ అభినందించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ న్యూరాలజిస్ట్‌ కోర్సు చదివి రోగులకు సేవచేస్తానని తెలిపింది.

పాపన్నపేట మండలంలో...
పాపన్నపేట మండలం కొడుపాక గ్రామానికి చెందిన సారికశర్మ ఎంసెట్‌లో 798వ ర్యాంకు సాధించింది. ఏడుపాయల దుర్గమ్మ ఆలయంలో పూజారిగా పనిచేసే శంకరశర్మ కూతురు సారికశర్మ టెన్త్‌ మెదక్‌ సిద్ధార్థ్‌ పాఠశాలలో, ఇంటర్‌ హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో పూర్తిచేసింది. గురువారం విడుదల చేసిన ఎంసెట్‌ ఫలితాల్లో సారిక 798ర్యాంకు సాధించింది. అలాగే మండలంలోని పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన మన్యం స్నేహ 1429వ ర్యాంకు సాధించింది.

మరిన్ని వార్తలు