మిడుతూరు మహిళకు స్వైన్‌ఫ్లూ

13 Feb, 2017 23:19 IST|Sakshi
కర్నూలు(హాస్పిటల్‌): నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వారం రోజుల క్రితం ఈమెను కుటుంబ సభ్యులు ఊపిరితిత్తుల పనితీరులో సమస్య రావడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. వైద్యులు ఆమెను పరిశీలించి టీబీసీడీ వార్డులో చేర్పించారు. స్వైన్‌ఫ్లూగా అనుమానించి నిర్ధారణ కోసం వైద్యపరీక్షలు చేయించారు. ఆమెకు స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉన్నట్లు సోమవారం ఆసుపత్రి అధికారులకు నివేదిక అందింది. దీంతో ఆమెను పేయింగ్‌బ్లాక్‌లోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే డోన్‌లో ఓ మహిళ స్వైన్‌ఫ్లూ సోకి మరణించింది. ఈమెతో పాటు కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్, నందికొట్కూరు మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వ్యక్తులకు ఈ వ్యాధి సోకిన విషయం విదితమే.
 
>
మరిన్ని వార్తలు