ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి

3 Sep, 2016 18:56 IST|Sakshi
ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి
వర్జీనియా: అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తతో కలిసి వర్జీనియాలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎంపీ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ, అమెరికా వంటి అగ్రదేశంలో ఉపాధి పొందుతున్న ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు.

హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారని వివరించారు. నిర్వాహకులు రవి పల్ల, ఉజ్జల భూమేశ్, జయంతి, రాజేశ్‌ మందారెడ్డి, జయంత్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు