తొలి రోజే పెట్రో పిడుగు

2 Jan, 2017 23:22 IST|Sakshi
తొలి రోజే పెట్రో పిడుగు

పెట్రోల్‌ లీటర్‌పై రూ.1.29, డీజిల్‌ లీటర్‌పై 97 పైసలు వడ్డన
లబోదిబోమంటున్న వాహనదారులు


ఖమ్మం సహకారనగర్‌ : కొత్త ఏడాది తొలి రోజు జనంపై పెట్రో పిడుగు పడింది. గత నెల 16వ తేదీనే పెట్రోల్‌ ధర రూ. 2.21, డీజిల్‌ ధర రూ.1.79 పెంచారు. తాజాగా ఆదివారం మళ్లీ పెట్రో ధరలు పెంచడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పెట్రోల్‌ లీటర్‌పై రూ. 1.29పైసలు, డీజిల్‌ లీటర్‌పై రూ. 97పైసలు వడ్డించింది.  ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 140పెట్రోల్‌ బంక్‌లున్నాయి. వీటి ద్వారా పెట్రోల్‌ రోజుకు సుమారు 6 లక్షల  లీటర్లు,  డీజిల్‌ లక్షా 20వేల లీటర్ల వినియోగం జరుగుతోంది.  ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర 73.69పైసలు ఉండగా పెరిగిన ధరలతో లీటర్‌ పెట్రోల్‌ 74.98పైసలకు చేరుకుంది. స్థానిక పన్నులతో మరో 30పైసలు పెరిగే అవకాశంఉంది. డీజిల్‌ లీటర్‌ 61.92 పైసలు ఉండగా, 62.89పైసలకు చేరుకుంది. స్థానిక పన్నులతో అదనంగా మరో 15పైసలు పెరగనుంది. నెలకు రెండు జిల్లాల ప్రజలపై సుమారు రూ. 3 కోట్ల వరకు భారం పడనుంది.  పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలు కానున్నాయి. ఇటీవల కాలంలో పెరిగిన పెట్రో ధరలతోనే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా పెరిగిన ధరలతో వాహనదారులపై మరింత భారం పడనుంది.  వరుసగా ఇటీవల కాలంలోనే రెండు సార్లు పెట్రో ధరలు పెరగటంతో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

మరిన్ని వార్తలు