ప్రతి గ్రామపంచాయతీలో మొక్కలు నాటాలి

26 Jul, 2016 23:42 IST|Sakshi
సూర్యాపేటరూరల్‌ : ప్రతి గ్రామపంచాయతీలో తప్పనిసరిగా 40 వేల మొక్కలు నాటాలని సూర్యాపేట తహసీల్దార్‌ మహమూద్‌అలీ, ఎంపీడీఓ నాగిరెడ్డి కోరారు. మంగళవారం సూర్యాపేట మండల సమాఖ్య కార్యాలయంలో హరితహారంలో భాగంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేసిన యాక్షన్‌ప్లాన్‌కు సంబంధించి నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటివరకు మండలంలో రెండు లక్షల మొక్కలు నాటామని.. మరో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, రైతులకు అదనపు ఆదాయాన్నిచ్చే, ఇళ్లలో నాటేందుకు ప్రజలకు కావాల్సిన మెుక్కలు అందజేసి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఓ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఓలు, వివిధ గ్రామాల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు