ఆర్డీఓల బదిలీ

30 Dec, 2016 23:07 IST|Sakshi
- కర్నూలుకు మల్లికార్జున
- నంద్యాలకు రాంసుందర్‌రెడ్డి నియాకం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఎట్టకేలకు ఆర్డీఓల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు వచ్చాయి. కర్నూలు ఆర్డీఓగా మల్లికార్జున, నంద్యాల ఆర్డీఓగా రాంసుందర్‌రెడ్డిలను నియమించారు. కర్నూలు జిల్లాకు చెందిన మల్లికార్జునను ఇదే జిల్లాలో ఆర్డీఓగా నియమించడం విశేషం. గతంలోఇతను కర్నూలు, కోడుమూరు, గూడూరు, సి. బెళగల్‌, గోనెగండ్ల, తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం హంద్రీనీవా సుజల స్రవంతి యూనిట్‌–4లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నారు. కర్నూలు ఆర్డీఓగా పనిచేస్తున్న రఘుబాబును కాకినాడ బదిలీ చేశారు. ఈయన మూడేళ్ల పాటు ఇక్కడ పనిచేశారు. నంద్యాల ఆర్డీఓగా రాంసుందర్‌రెడ్డి నియమితులయ్యారు.ఇతను గతంలో ఆదోని ఆర్డీఓగా దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ ఈడీగా పనిచేస్తున్నారు. ఇంతవరకు నంద్యాల ఆర్డీఓగా పనిచేసిన సుధాకర్‌రెడ్డి హంద్రీనీవా సుజల శ్రవంతి యూనిట్‌–4 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతోంది. తుది ఓటర్ల జాబితాను జనవరి 16న ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా సవరణకు ఆటంకం లేకపోతే వీరిని రిలీవ్‌ చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు, నంద్యాల ఆర్డీఓలు రిలీవ్‌ కావడం, కొత్త ఆర్డీఓలు బాధ్యతలు స్వీకరించడం జిల్లా కలెక్టర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 
మరిన్ని వార్తలు