ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష

23 Aug, 2016 23:56 IST|Sakshi
ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష

వైవీయూ :

విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ సీనియర్‌ సివిల్‌ జడ్జి యు.వి. ప్రసాద్‌ పేర్కొన్నారు. వైవీయూలో ర్యాగింగ్‌ అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో విశ్వవిద్యాలయం–డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్‌ సివిల్‌ జడ్జి యు.వి. ప్రసాద్‌ మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడితే విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించడంతో పాటు ప్రవేశాలను సైతం రద్దుచేసే అధికారం కళాశాల యాజమాన్యానికి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తమ చక్కటి భవిష్యత్తు కోసం ర్యాగింగ్‌ వంటి అంశాల జోలికి వెళ్లకుండా ఉండాలని సూచించారు. అనంతరం ర్యాగింగ్‌ చట్టాలను గురించి సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య జి. గులాంతారీఖ్, రిజిస్ట్రార్‌ ఆచార్య వై. నజీర్‌అహ్మద్, విద్యార్థులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు