స్లాస్, త్రీఆర్‌ పరీక్షలను సమర్థంగా నిర్వహించండి

14 Dec, 2016 22:33 IST|Sakshi
స్లాస్, త్రీఆర్‌ పరీక్షలను సమర్థంగా నిర్వహించండి
కంబాలచెరువు : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్న 'స్లాస్‌' 'త్రీ ఆర్‌ 'పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని రాజమహేంద్రవరం ఉపవిద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం తెలిపారు. స్థానిక కోటగుమ్మం వద్ద నున్న మండలవనరుల కేంద్రంలో ఉపాధ్యాయుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చదవడం, రాయడం, గణితభావనల స్థాయిని అంచనావేసేందుకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రశ్నాపత్రాలను పరీక్షకు ఒక గంటముందు ఆయా స్కూల్‌కాంప్లెక్స్‌లనుంచి తీసుకోవాలన్నారు. స్కూలు కాంప్లెక్స్‌ చైర్మన్‌లు వారి పరిధిల్లోని అన్ని స్కూల్స్‌ పరీక్షించి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రశ్నాపత్రాలు తక్కువ అయినచో మండలవిద్యాశాఖాధికారిని సంప్రదించాలని, ఎట్టిపరిస్థితుల్లో జిరాక్స్‌ తీయరాదన్నారు. కార్యక్రమంలో అర్బన్‌ స్కూల్స్‌ డీఐ అయ్యంకి తులసీదాస్, వై.వేణుగోపాలరావు, శ్రీనివాస్, ప్రసాద్, నీలిమ, ఇందిర, కుమారి పాల్గొన్నారు. 
పరీక్షలు వాయిదా
భానుగుడి(కాకినాడ) : జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో ఈ నెల 14,15 తేదీలలో జరగాల్సిన  స్లాష్, త్రీఆర్‌ఎస్‌ పరీక్షలను ఈనెల 16,17 తేదీలకు వాయిదా వేసినట్టు డీఈఓ ఆర్‌.నరసింహారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల ప్రశ్నపత్రాలను ఎంఈవోలకు పంపామని, ఈనెల 15న ఎంఈవోలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు పరీక్షలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. శాంపిల్‌ సర్వే పాఠశాలలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు డీసీఈబీల ద్వారా ఎంఈవోలకు పంపనున్నట్టు తెలిపారు.

 

మరిన్ని వార్తలు