మందులు పిచికారీ చేయండి

8 Aug, 2016 00:42 IST|Sakshi
కొత్తచెరువు: ప్రస్తుతం వేరుశనగ పంటకు ఆకుమచ్చ, తామర పురుగు, సూక్ష్మలోపాలను నివారించాలంటే  మందులను పిచికారీ చేయాలని కదిరి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త శివశంకర్‌నాయక్‌ తెలిపారు. ఆదివారం మండలంలోని తలమర్ల  పొలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించారు.  తామర పురుగు నివారణకు మోనోక్రోటోపాస్‌ ఎకరాకు 400 మిల్లీలీటర్లు, ఆకుమచ్చ తెగుళ్లకు ఎక్సప్‌ కోనజోల్‌ 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వేమన,చండ్రాయుడు, రైతులు పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు