బ్లాక్ లో 'శ్రీమంతుడు' సినిమా టికెట్లు

5 Aug, 2015 19:06 IST|Sakshi
బ్లాక్ లో 'శ్రీమంతుడు' సినిమా టికెట్లు

విశాఖపట్టణం: మహేశ్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' సినిమా టికెట్లును బ్లాక్ లో విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అభయ బ్రాడ్ బాండ్ కార్యాలయంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం దాడి చేసి బ్లాక్ టిక్కెట్ల విక్రయాన్ని అడ్డుకున్నారు. 800 టిక్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.

రూ. 200 టిక్కెట్ ను రూ.1000 అమ్ముతున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. సినిమా టిక్కెట్లు బ్లాక్ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.  'శ్రీమంతుడు' సినిమా శుక్రవారం విడుదలకానుంది.

మరిన్ని వార్తలు