వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టును రద్దు చేయాలి

1 Aug, 2016 18:13 IST|Sakshi
వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టును రద్దు చేయాలి

రామన్నపేట : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే తెలంగాణ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టును రద్దు చేయాలని తెలంగాణ ఉద్యమ వేదిక జిల్లా కన్వీనర్‌ యానాల లింగారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.కె చాంద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం టీయూవీ నాయకులతో కలసి కక్కిరేణి గ్రామశివారులో ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో ఆందోళన నిర్వహించారు. ఆ స్థలంలో టీయూవీ జెండాలను పాతారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కోరారు.  వివిధ జిల్లాలనుంచి వ్యర్థాలను తెచ్చి భూమిలో పాతిపెట్టడం వల్ల నియోజకవర్గంలోని సగం గ్రామాలు కాలుష్యం బారినపడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఈనెల 2న నిర్వహించనున్న కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు.   కార్యక్రమంలో నాయకులు శివరాత్రి లక్ష్మమ్మ, పిట్ట వెంకట్‌రెడ్డి, శివరాత్రి లక్ష్మమ్మ, నార్కట్‌పల్లి రమేష్, కమ్మంపాటి వెంకన్న, చింతల యాదగిరి, చింత లక్ష్మణ్, వేముల సైదులు, బెడిద లింగస్వామి, సోములు బాలరాజు, బాశబోయిన లింగయ్య, దువ్వాసి సుధాకర్, చిల్లా గోపాల్, బి.సత్తయ్య పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు