బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు

12 Aug, 2016 00:26 IST|Sakshi
  • సీపీ సుధీర్‌బాబు
  • వరంగల్‌ : నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు హెచ్చరించారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు ప్రాంతాల్లోని బహిరంగప్రదేశాలు, మద్యం షాపుల ముందు మందు బాబులు ఇష్టారాజ్యంగా మద్యం సేవిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సీపీ గురువారం పత్రికలకు ప్రకటన జారీ చేశారు.
     
    విచ్చలవి డిగా మద్యం సేవిస్తున్నందున నగరంలోని ప్రజలతో పాటు మహిళ లు, విద్యార్థులు, పిల్లలు, ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. వీరి వల్ల అభద్రతాభావం వ్యక్తం అవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉండడంతో సీపీ ప్రత్యేక దృష్టి సారించిన ట్లు తెలిసింది. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సెక్షన్‌ 144 ప్రకారం 2016 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని ని షేదిస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి నిషేదిత ఉత్తర్వులను ఉల్లంఘించిన వ్యక్తులపై ఇప్పటి వరకు 220 కేసులు నమోదు చేయడంతో పాటు 238 మంది మ ద్యపాన ప్రియులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. వీరికి కోర్టు రూ.40,640 జరిమానా విధించింది. ఈ నిషేదాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో గస్తీ ముమ్మ రం చేశారు. ఇందుకోసం ప్రతి పోలీ ‹స్‌డివిజన్‌ పరిధిలో ప్రత్యేక బృం దా లు ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, అసభ్యం గా ప్రవర్తించినా 100 నంబర్‌కు డయల్‌ చేయాలని,లేక 9491089257 వాట్స ప్‌ నంబర్‌కు ఫొటోలు, వీడియో, సమాచారం అందిస్తే వెంటనే చర్య లు తీసుకుంటామని సీపీ తెలిపారు.  
మరిన్ని వార్తలు