మహారాష్ట్ర ఒప్పందంపై నిర సన

24 Aug, 2016 00:15 IST|Sakshi
అంబేద్కర్‌ విగ్రహం ఎదుట బైఠాయించిన డీకే అరుణ, కాంగ్రెస్‌ నాయకులు
మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : ప్రాజెక్టులపై మహా రాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని నిరసిస్తూ కాం గ్రెస్‌ నాయకులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక న్యూటౌన్‌లోని డీసీసీ కార్యాలయం నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లాకొత్వాల్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధాఅమర్‌ ర్యాలీగా తరలి వెళ్కిల బస్టాండు సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. అక్కడి నుంచి వెళ్లి కలెక్టరేట్‌ గేటు వద్ద ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ హక్కుల తాకట్టు
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు. వాస్తవాలను మరుగున పెట్టి  కోటి ఎకరాలకు నీరిస్తామని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆర్‌.రవీందర్‌రెడ్డి, కష్ణ, కె.మణెమ్మ, ముత్యాల ప్రకాశ్‌ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు