షేక్స్‌పియర్‌ రచనల్లో మహిళల పాత్ర

16 Sep, 2016 21:28 IST|Sakshi
భీమవరం: షేక్స్‌పియర్‌ రచనల్లో మహిళల పాత్రలు ఎంతో ప్రభావవంతమైనవి అందువల్ల విద్యార్థులు ప్రతి ఒక్కరూ షేక్స్‌పియర్‌ రచనలు తప్పనిసరిగా చదవాలని  శాతివాహన విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామ భాస్కరరావు అన్నారు.  భీమవరం ఆర్‌ఆర్‌డీఎస్‌ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన షేక్స్‌పియర్‌ రచనలపై జాతీయస్థాయిలో సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్బంగా సావనీర్‌ను విడుదల చేశారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సనత్‌కుమార్‌ అధ్యక్షత వహించగా పాలకొల్లు దాసరి నారాయణరావు‡ కళాశాల ప్రిన్సిపాల్‌ నాగమణి, గుంటూరుకు చెందిన రిటైర్డ్‌ అధ్యాపకురాలు డాక్టర్‌ వరలక్ష్మి, అక్కిరాజు, రవిశంకర్, స్వరూప, శ్రీలక్ష్మి, పార్వతి, మోజేస్, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు