యువకుడి ఛాతీలో రెండు కిలోల గడ్డ | Sakshi
Sakshi News home page

యువకుడి ఛాతీలో రెండు కిలోల గడ్డ

Published Fri, Sep 16 2016 9:20 PM

యువకుడి ఛాతీలో రెండు కిలోల గడ్డ - Sakshi

*  జీజీహెచ్‌లో అరుదైన ఆపరేషన్‌
 
గుంటూరు మెడికల్‌: ఛాతిలో నొప్పితో గుంటూరు జనరల్‌ ఆస్పత్రికివచ్చిన యువకుడికి కార్డియోథొరాసిక్‌సర్జరీ వైద్యులు సకాలంలో ఆపరేషన్‌ చేసి ప్రాణాలు కాపాడారు. అరుదుగా జరిగే ఈ ఆపరేషన్‌ వివరాలను శుక్రవారం సీటీఎస్‌ వైద్య విభాగం ఇన్‌ఛార్జి డాక్టర్‌ మెగావత్‌ మోతీలాల్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు నెహ్రూనగర్‌ 10వలైన్‌కు చెందిన బత్తుల హనుమంతురావు, రాణిల  రెండో కుమారుడు బత్తుల ధనరాజు  డిగ్రీ చదువుతున్నాడు. ఇతను మూడు నెలలుగా ఛాతీలో నొప్పితో బాధపడుతూ ప్రై వేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈనెల 15న  వైద్యంకోసం జీజీహెచ్‌కు రాగా సీటీఎస్‌ వైద్యులు పరీక్షలు చేసి ఛాతీలో కుడివైపు సుమారు రెండు కిలోల బరువు ఉన్న గడ్డ(హిమరేజిక్‌ సిస్ట్‌) ఉన్నట్లు నిర్ధారణ చేశారు.  వెంటనే మూడు గంటలసేపు ఆపరేషన్‌ చేసి  యువకుడిని ప్రాణాపాయ స్థితినుంచి రక్షించినట్లు డాక్టర్‌ మోతీలాల్‌ చెప్పారు. సాధారణంగా ఆటలు ఆడే సమయంలో ఏదైనా దెబ్బతగిలితే ఇలాంటి గడ్డలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. గడ్డ ఖచ్చితమైన నిర్ధారణ కోసం గుంటూరు వైద్య కళాశాల పెథాలజీ విభాగానికి పరీక్ష కోసం పంపించామని తెలిపారు. సుమారు లక్ష రూపాయల ఖరీదు చేసే   ఆపరేషన్‌ను ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామన్నారు. వారం రోజుల్లో ధనరాజును ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు. ఆపరేషన్‌ ప్రక్రియలో తనతోపాటుగా మత్తు వైద్యులు సీతారామయ్య, భవాని, పీజీ ౖÐð ద్యులు లక్ష్మీప్రసన్న, వేణు, నవీన్‌ పాల్గొన్నట్లు డాక్టర్‌ మోతీలాల్‌ తెలిపారు.

Advertisement
Advertisement