ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం మీదే..

5 Oct, 2016 01:23 IST|Sakshi
ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం మీదే..
  • గురుకుల కళాశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌
  • కేయూ క్యాంపస్‌ : కరెంట్‌ అఫై ర్స్‌ తదితర అంశాలపై పట్టు సాధించడంతో పాటు ప్రణాళిక బద్ధంగా చదివితే పోటీపరీక్షల్లో విజయం సాధించడం సులువవుతుందని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని కెరీర్‌ గైడెన్‌స సెల్‌ విభా గం, కేయూ కేయూ టెక్నికల్‌ ఉద్యోగుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రూప్‌ 2, కానిస్టేబుల్‌ ఉచిత కోచింగ్‌క్యాంపును మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థులను ఉద్దేశించి మా ట్లాడుతూ.. తాను ఇంటర్‌ వరకు తెలుగు మీడియంలోనే చుదువుకోగా.. విద్యార్థి దశ లో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుం డా చూస్తూ చదవడం ద్వారా ఐపీఎస్‌ సాధించిన తీరును వివరించారు. కార్యక్రమంలో కెరీర్‌ గైడెన్‌స సెల్‌ డైరెక్టర్‌ కోచింగ్‌ క్యాంపు కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ కె.విజయ్‌బాబు, యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌న్‌స కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.రామానుజరావుతో పాటు డాక్టర్‌ పుల్లా శ్రీనివాస్, బాలాజీ, కేఎల్‌ఎన్‌. రావు, రాము, బాబు, నవీన్‌, కృష్ణమాచార్య పాల్గొన్నారు.
    విద్యార్థుల ఎదుగుదల గర్వకారణం
    నయీంనగర్‌ : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదివిన, చదువుతున్న విద్యార్థులు అత్యున్నత స్థాయి ఎదుగుతుండడం గర్వకారణమని ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ‘స్వేరోస్‌’ ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్‌ భవన్‌ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో స్వేరోస్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌, ట్రాఫిక్‌ ఎస్సై మధుతో పాటు ఎర్ర రాజు, రవికుమార్‌తో పాటు వి ద్యార్థులు, తల్లిదండ్రులు  పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు